Contact us at +91-99497-62000 | allipuram@gmail.com

ముచ్చట… ఏ ఇద్దరు కలిసినా ముచ్చటే. అది ఏ ముచ్చటైనా ఆసక్తికరమే. అది ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఇంటి పక్క వాళ్లు కావచ్చు, లవర్స్ కావచ్చు, తోటి ప్రయాణికులు కావచ్చు… ఓ ముచ్చట ఆనందపెడుతుంది, ఒకటి ఆశ్చర్యపరుస్తుంది, మరొకటి భయపెడుతుంది, ఇంకొకటి బాధపెడుతుంది… ముచ్చట అంటే సమాచార మార్పిడి…

అయితే ఈ రోజుల్లో టెక్నాలజీ పెరిగింది.. అసలీ జనరేషనే వేరు.. ప్రపంచమంతా ఓ కుగ్రామం. 24 గంటలూ ఇంటర్నెట్ కు అతుక్కుపోయే రోజులొచ్చాయ్. ఆ దేవుడు.. రోజుకు 24 గంటలే ఇవ్వాలా అనుకునే కాలంలో ఉన్నాం మనం. ఇంటర్నెట్ లేని రోజును ఊహించడం కష్టం. happy wheels demo అందుకే ఈ పోటీ ప్రపంచంలో నెగ్గుకురావాలంటే… ఎంతో నేర్చుకోవాలి, ఎన్నో తెలుసుకోవాలి.

ప్రతి ఒక్కరికి ఎన్నో టెన్షన్స్… ఉద్యోగంలో, వ్యాపారంలో, చదువులో… ఎక్కడైనా ఒత్తిడి, నిరాశ, నిస్పృహ… వీటిని తగ్గించుకోవడానికి మనిషి వెతుక్కోని అలవాట్లు లేవు. టెన్షన్స్ ను మరిచిపోవడం కోసం ఎక్కువ మంది కోరుకునేది ఎంటర్ టైన్ మెంట్. ఎన్నో రకాల ఎంటర్ టైన్ మెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ…. వాటిని చాలా మంది ఎంజాయ్ చేయలేకపోతున్నారు.

వీటన్నింటికి పరిష్కారం చూపించడానికే మీ ముందుకు వచ్చింది ముచ్చట.కామ్. ప్రపంచంలోని అవసరమైన ఏ విషయాన్నైనా ముచ్చటగా…ఎంటర్ టైన్ మెంట్ వే లో చెప్పడానికే ఆవిర్భవించింది మీ ముచ్చట.కామ్